ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆరోగ్యంకామారెడ్డి పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

కామారెడ్డి పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

కామారెడ్డిలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10( వార్త సంధ్య )

కామారెడ్డి పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరం 11 ఆగస్టు 2026 (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాండిపని కాలేజ్ ప్రక్కన ఉన్న యశోద మెడికల్ సెంటర్‌లో జరుగుతుంది.

 

శిబిరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. కేతన్ పాలుగారు మరియు డా. బి. జె. ఆదిత్య సౌమ్యరాజు పాల్గొని రోగులకు ఉచిత వైద్య సలహాలు అందించనున్నారు.

 

మోకాళ్ల నొప్పులు, తుంటి సమస్యలు, మోచేయి, కీళ్ల మార్పిడి అవసరాలు, వెన్నునొప్పి, ఎముకలు మరియు కండరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

 

అపాయింట్‌మెంట్ కోసం: 70757 03538

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!