భద్రాద్రి, జూలై 30 (వార్త సంధ్య): శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పెనగడప గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వాడేపల్లి రమేష్ హైమద్, పెనగడప యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 50 మందికి పైగా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు ఎన్. సురేష్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాథోడ్, గ్రామ సర్పంచ్ సీతారాములు, బ్లడ్ ఫౌండర్స్ బాలు, సెక్రటరీ సురేష్, డాక్టర్ హరి, డాక్టర్ సంతోష్, బీఆర్ఎస్ నాయకులు అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అతిథులు పేర్కొన్నారు.

