ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డినిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి – విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్...

నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి – విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి

– విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 12 (వార్త సంధ్య):

 

 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన “నిరుద్యోగ పోరు దీక్ష” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ పోరు దీక్షలో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగులను నిరాశపరిచిందని ఆయన విమర్శించారు. వెంటనే ఉద్యోగ నియామకాల కోసం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, అన్ని ఖాళీ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు గౌస్ పాషా, చందు, నోమన్, శ్రీకాంత్ రెడ్డి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!