ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిBLO పై దాడి.. విధులకు ఆటంకం.. ముగ్గురి పై కేసు నమోదు

BLO పై దాడి.. విధులకు ఆటంకం.. ముగ్గురి పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

బీఎల్‌ఓపై దాడి.. విధులకు ఆటంకం.. ముగ్గురిపై కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 12 ( వార్త సంధ్య )

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

 

పోలీసుల వివరాల ప్రకారం.. రామేశ్‌పల్లి గ్రామానికి చెందిన బీఎల్‌ఓ అధికారి శ్రీమతి ఠాకూర్ అనిత (42) జూలై 10న ఎన్యూమరేషన్ విధులు నిర్వహిస్తుండగా ఉజ్మా బేగం ఫోటో లేని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించింది. ఫోటో లేకపోవడంతో ఫారం స్వీకరించలేమని బీఎల్‌ఓ తెలియజేశారు. ఈ సందర్భంగా ఉజ్మా బేగం తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని చెప్పడంతో, నిబంధనల ప్రకారం ఫారం తీసుకోవడానికి బీఎల్‌ఓ నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

దీంతో ఉజ్మా బేగం, మరో మహిళ కలిసి బీఎల్‌ఓ విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్య పదజాలంతో దూషించి, చేతి పట్టుకుని తోసివేయడంతో పాటు బీఎల్‌ఓ కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. అనంతరం అక్కడికి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చంపేస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడే ఉన్న సూపర్వైజర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

 

ఈ ఘటనపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 534/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 132, 324(2), 351(3), 352 r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!