ePaper
Monday, July 13, 2026
📄 ePaper
Homeతెలంగాణరామక్కపేటలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామక్కపేటలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని నేతల ధీమా

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వడ్ల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించగా, పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు వడ్ల యాదగిరి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ మాక్బుల్ హుస్సేన్, గ్రామ వార్డు సభ్యులు సిద్దుల కుమార్, పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చీకోడ్‌లో ఘనంగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!