ePaper
Monday, March 16, 2026
spot_img
📄 ePaper
Homeతెలంగాణపెద్దమ్మ తల్లిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • పర్షరాం నగర్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

  • ఆలయాభివృద్ధికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ

  • ఆలయ కమిటీ సభ్యుల చేత సన్మానం


దుబ్బాక ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పర్షరాం నగర్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కోసం మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, దుబ్బాక సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పర్స దేవరాజు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!