ePaper
Sunday, March 15, 2026
spot_img
📄 ePaper
Homeతెలంగాణకోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక మినీ మొబైల్ ఆసుపత్రి

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక మినీ మొబైల్ ఆసుపత్రి

📰 Generate e-Paper Clip

  • మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యాధునిక మినీ మొబైల్ ఆసుపత్రి

మునుగోడు ప్రతినిధి , మార్చి -15 (వార్త సంధ్య): మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి స్మారకార్థం స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ హాస్పిటల్ ను వినియోగంలోకి తీసుకువచ్చారు.ఈ మినీ మొబైల్ ఆసుపత్రిలో కంటి పరీక్షలతో పాటు సీబీపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్‌రే వంటి వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెంటనే నిర్వహించే సౌకర్యం ఉంది.కంటి పరీక్షలకు వచ్చే చాలా మంది పేషెంట్లలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఆపరేషన్‌కు ఎంపిక కాకుండా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గమనించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఏ ఒక్కరూ చిన్న రుగ్మత కారణంగా చికిత్స లేకుండా వెళ్లిపోకూడదనే ఉద్దేశంతో ఈ మినీ మొబైల్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇప్పటివరకు నిర్వహించిన 12 ఉచిత కంటి వైద్య శిబిరాల్లో 9034 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,1970 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు.ఇప్పుడు 13వ విడత శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అన్ని రకాల ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు.ఇలాంటి కాలంలో సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోని పరిస్థితుల్లో, ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ, వచ్చిన ప్రతి పేషంట్‌కు భోజనం ఏర్పాటు చేసి వారి ఇంటి వరకు పంపిస్తున్నందుకు ప్రజలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!