ePaper
Wednesday, March 18, 2026
📄 ePaper
Homeజాతియంపుదుచ్చేరిలో రాజకీయ ప్రకంపనలు: ఎల్‌జేకే-డాక్ కన్సల్టింగ్ కూటమి సంచలనం

పుదుచ్చేరిలో రాజకీయ ప్రకంపనలు: ఎల్‌జేకే-డాక్ కన్సల్టింగ్ కూటమి సంచలనం

📰 Generate e-Paper Clip

  • రెండు నెలల్లోనే రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన కొత్త పార్టీ
  • డేటా ఆధారిత వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తున్న ఎల్‌జేకే
  • ఏఐ వింగ్‌తో సరికొత్త రాజకీయ ధోరణి

ఢిల్లీ ప్రతినిధి పుదుచ్చేరి, మార్చి 17 (వార్త సంధ్య): భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ పుదుచ్చేరిలో “లక్ష్య జననాయక కచ్చి” (ఎల్‌జేకే) పార్టీ సంచలనంగా మారుతోంది. పార్టీ ఏర్పడిన కేవలం రెండు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో గట్టి ప్రభావాన్ని చూపడం విశేషం. ఈ వేగవంతమైన ఎదుగుదలకు ‘డాక్ కన్సల్టింగ్’ అనే పొలిటికల్ అడ్వైజరీ సంస్థ కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.పార్టీ అధికారికంగా ప్రారంభం కాకముందే డాక్ కన్సల్టింగ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో డేటా సేకరణ, ఇంటింటి సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యలను గుర్తించింది. వాటి ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయడం వల్ల ప్రజలతో పార్టీకి త్వరగా అనుబంధం ఏర్పడింది.

పుదుచ్చేరి భౌగోళిక ప్రత్యేకతను ప్రతిబింబించేలా పార్టీని “సీ లాంచ్” రూపంలో ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సముద్రంతో అనుబంధం ఉన్న నాలుగు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తామనే సంకేతాన్ని ఈ విధానం ద్వారా పార్టీ ఇచ్చింది.ప్రస్తుతం ఈ పార్టీకి 75,000 మందికి పైగా క్రియాశీల సభ్యత్వం ఉండటంతో పాటు బూత్ స్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఏర్పడింది. దేశంలో అరుదుగా కనిపించే విధంగా ప్రత్యేక “ఏఐ వింగ్”ను ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక సాంకేతికతను రాజకీయాల్లో వినియోగిస్తున్న పార్టీగా గుర్తింపు పొందింది.

అంతర్గత సర్వేల ప్రకారం, ప్రారంభమైన రెండు నెలల్లోనే ఎల్‌జేకే ఓటు శాతం గణనీయంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎల్‌జేకేతో సంప్రదింపులు జరుపుతున్నాయి.డేటా ఆధారిత వ్యూహాలు, నిరంతర ప్రజా సంప్రదింపులతో తక్కువ సమయంలోనే ఒక కొత్త పార్టీను బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టవచ్చని డాక్ కన్సల్టింగ్ ప్రదర్శించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!