ePaper
Tuesday, March 17, 2026
📄 ePaper
Homeతెలంగాణకార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన మధుయాష్కి గౌడ్

కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన మధుయాష్కి గౌడ్

📰 Generate e-Paper Clip

  • ప్రజా సమస్యలపై అధికారులకు వినతి పత్రం
  • అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోరిన కాంగ్రెస్ నేతలు
  • అడిషనల్ కమిషనర్‌తోనూ భేటీ

హైదరాబాద్, మార్చి 17 (వార్త సంధ్య): పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని తార్నాకలోని ఆయన కార్యాలయంలో కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పరిష్కారం చేపట్టడంతో పాటు అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.అదేవిధంగా అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను కూడా కలిసి పలు సమస్యలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, రాపోలు రాములు, పావని, డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, దెంది శశిధర్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ, గణేష్ నాయక్, దేవాలయ కమిటీ డైరెక్టర్లు కంచర్ల కవిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!