పోతారం గ్రామంలో ఏడ్ల వెంకటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు
పెద్దపల్లి, మంథని, మార్చి 16 (వార్త సంధ్య): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదివారం మంథని పట్టణంలో నిర్వహించిన తాటికొండ కిష్టాస్వామి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిష్టాస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అదేవిధంగా మంథని మండలం పోతారం గ్రామంలో జరిగిన ఏడ్ల వెంకటమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కూడా దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమం అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు.

