ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homewanaparthyఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిఐటియు పోరాటం..

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిఐటియు పోరాటం..

📰 Generate e-Paper Clip

అరెస్టులు, కేసులతో భయపెట్టలేరు సిఐటియు జిల్లా నాయకత్వం…

వార్త సంధ్య : వనపర్తి జిల్లా, ప్రతినిధి,అక్టోబర్9:

వనపర్తి ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన శాంతియుత ధర్నాపై నమోదు చేసిన అక్రమ కేసులో భాగంగా శుక్రవారం వనపర్తి జిల్లా కోర్టుకు,సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, మాజీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు,జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, జిల్లా కార్యదర్శి బుచ్చమ్మ నాయకులు హాజరయ్యారు

.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ,రాత్రింబవళ్లు ప్రజారోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే,ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు.కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై గళమెత్తితే అరెస్టులు, కోర్టు కేసులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్ని కేసులు పెట్టినా,ఎన్ని నిర్బంధాలు విధించినా కార్మిక వర్గం తరఫున పోరాడేందుకు సిఐటియు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆశా వర్కర్లతో కలిసి పోరాటాన్ని మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!