ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిఎన్యుమరేషన్ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ఎన్.వి. గిరి

ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ఎన్.వి. గిరి

📰 Generate e-Paper Clip

ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ఎన్.వి. గిరి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 12 (వార్త సంధ్య):

ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ ఎన్.వి. గిరి అధికారులను ఆదేశించారు.

శనివారం కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో కాకతీయ నగర్ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సేకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఇప్పటికే అందిన ఫారాల డిజిటలైజేషన్ కొనసాగుతోందని, మిగిలిన ఫారాలను సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తి చేసి, యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే ఏదైనా కారణంతో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోతే, వాటిని రీజనరేట్ చేసి వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ హిమబిందు, ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ హన్మంత్ రావు, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత, సీనియర్ నాయకులు  ఇప్ప శ్రీనివాస్ బిఎల్ఓ లు  ఇతర  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!