ePaper
Friday, March 13, 2026
spot_img
📄 ePaper
Homeతెలంగాణసమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్దం కావాలని కార్మికులకు పిలుపు

సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్దం కావాలని కార్మికులకు పిలుపు

📰 Generate e-Paper Clip

కార్యాచరణ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు

కొత్తగూడెం/సింగరేణి, మార్చి 13 (వార్త సంధ్య) : సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నిచ్చిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం కొత్తగూడెం శేషగిరిభవన్ లో జరిగిన వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమం లో వారు పాల్గొని ప్రసంగించారు. సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కనుక భవిష్యత్తు కార్యాచరణ వాల్ పోస్టర్ను విడుదల చేసింది, ఏఐటియుసి ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరియు ఏప్రిల్ లో జరగబోయే సమ్మె విజయవంతం చెయ్యాలని పిలుపు నివ్వడం జరిగిందని, కావున జరగబోయే ఆందోళన కార్యక్రమంలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని సింగరేణి మనుగడను కాపాడాలని కోరారు, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు మాతంగి లింగయ్య,లక్ష్మీనారాయణ,బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు,నరేష్,నితిన్, సోమయ్య, తాతిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!