ePaper
Sunday, March 15, 2026
spot_img
📄 ePaper
Homeతెలంగాణచల్మెడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం

చల్మెడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం

📰 Generate e-Paper Clip

  • ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు (వార్త సంధ్య) – మార్చి 15 : మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ముంత మల్లేష్ – రేణుక దంపతుల నూతన ఇందిరమ్మ గృహాన్ని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా పేదలకు స్వంత ఇంటి కల సాకారం అవుతోందని తెలిపారు. ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాలకూరి యాదయ్య గౌడ్, జాల వెంకన్న, మాదగోని రాజేష్ గౌడ్, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డి, పొలగోని ప్రకాష్, టేకుమట్ల శ్రీరాములు, జంగిలి నాగరాజు, పాంపాటి విజయ్ కుమార్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!