దుబ్బాక ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం పరిధిలోని అందె గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి లబ్ధిదారుల కొత్త ఇళ్లలో గృహ ప్రవేశం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేదలకు గృహసౌకర్యం కల్పించేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో మందికి లాభం చేకూరుస్తోందని తెలిపారు.పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అందె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
0
1
Previous article
Next article

