ఎర్రవల్లి గ్రామపంచాయతీ సమస్యలను పరిష్కరించాలి

ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించిన గ్రామ ప్రతినిధులు అచ్చంపేట ప్రతినిధి, ఆగస్టు 18 (వార్త సంధ్య): చారకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎర్రవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి–గోకారం రిజర్వాయర్ పరిధిలో ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలు ముంపునకు గురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ (R&R) ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ...