పాల్వంచ లో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనా మహోత్సవం

  భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని విరాట్ నగర్‌లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనా మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి బ్రహ్మశ్రీ పెద్దోజా నాగాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ, గణపతి పూజ, అభిషేకాలు, పల్లకీ సేవ,...