Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 5:55 pm Posted by : VARTHA SANDHYA DESK

పాల్వంచ లో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనా మహోత్సవం

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని విరాట్ నగర్‌లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనా మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి బ్రహ్మశ్రీ పెద్దోజా నాగాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ, గణపతి పూజ, అభిషేకాలు, పల్లకీ సేవ, మూలమంత్ర హోమం, సజీవ సమాధి ఘట్టం వంటి కార్యక్రమాలు పూజారి బ్రహ్మశ్రీ ఆరిందాల యశ్వంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. మహోత్సవం సందర్భంగా సుమారు వెయ్యిమంది భక్తులకు మహా అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నదానం కార్యక్రమాన్ని కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలె జానకిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోండం వెంకన్న గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాలాచారి, సెక్రటరీ మోత్కురి రవీంద్రాచారి, కోశాధికారి జుజ్జురి ప్రభాకరాచారి, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.