“వీరాభిమాని” మూవీ పోస్టర్ ఆవిష్కరణ

రక్తదానం గొప్పతనాన్ని చాటే “వీరాభిమాని” గుమ్మడి నరసయ్య చేతుల మీదుగా మూవీ పోస్టర్ ఆవిష్కరణ ఇల్లెందు, ఆగస్టు 19 (వార్త సంధ్య): రక్తదానం యొక్క గొప్పతనాన్ని, మానవతా విలువలను చాటిచెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న “వీరాభిమాని” సినిమా పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ ప్రజా నాయకుడు  గుమ్మడి నరసయ్య తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రబృందం గుమ్మడి నరసయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన “వీరాభిమాని” చిత్రబృందానికి శుభాభినందనలు తెలిపారు. రక్తదానం వంటి సామాజిక అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా...