విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యారంగ సమస్యల పరిష్కారానికి వచ్చిన విద్యార్థులపై అక్రమ అరెస్టులు దారుణం: యుఎస్ఎఫ్ఐ ప్రభుత్వ అణచివేతతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని చంద్లాపురం మధు హెచ్చరిక హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ యుఎస్ఎఫ్ఐ (USFI) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్లాపురం మధు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేత చర్యలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు...