‘ఉపా’ ఉచ్చు వీడేనా..?
రాజేందర్, బద్రిల భవితవ్యంపై నేడే తీర్పు..! పౌరహక్కుల రక్షణలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి హైద్రాబాద్/హనుమకొండ,, వార్త సంధ్య : నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మైనింగ్ అక్రమాలపై కలం ఎత్తిన జర్నలిస్టు ఒకరు.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి గళం వినిపించిన స్కాలర్ మరొకరు. వీరిద్దరిపై మోపిన 'ఉపా' (UAPA) కేసులో ఐదేళ్ల ( 4 సంవత్సరాల, 9 నెలల, 2 రోజులు ) సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ దామెర రాజేందర్, ఓయూ...