ఇండ్ల స్థలాల కోసం ఆమరణ దీక్షకు టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధం

ఖమ్మం, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ప్రకటించింది. ఖమ్మం నగరంలోని మంచికంటి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మొదట సంతకాల సేకరణ కార్యక్రమంతో ఉద్యమాన్ని ప్రారంభించి, అనంతరం ధర్నాలు, రిలే...