తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సచివాలయం ముట్టడి: చోలేటి మహేష్ బాబు
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తీరుపై టీయూజేఏసీ ఆగ్రహం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యమకారులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు హైదరాబాద్, (వార్త సంధ్య ):తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీయూజేఏసీ) ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (కేకే కమిటీ) వ్యవహార శైలిపై టీయూజేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను చర్చల ప్రక్రియలో చివరి దశలో చేర్చడం ద్వారా అవమానించారని ఆరోపించారు....