గ్రామ దేవతల ఆలయాల్లో కుమ్మరులను శాశ్వత పూజారులుగా నియమించాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం వినతి కుమ్మర పూజారులకు గౌరవ వేతనాలు, దీపదూప నైవేద్యాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 16 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ దేవతల ఆలయాల్లో అనాదిగా దీప, ధూప, నైవేద్యాలు సమర్పిస్తూ వస్తున్న కుమ్మర కులస్థులను శాశ్వత పూజారులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (టీఆర్‌కేఎస్) రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత్ రావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో గల దేవాదాయ శాఖ మంత్రి...