సన్న వరి సాగు – లింగాపూర్ రైతుల ఆదర్శం

దుబ్బాక ప్రతినిధి మే 04(వార్త సంధ్య) సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామం ప్రస్తుతం సన్న వరి సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పంట మార్పిడిని అవలంబించిన స్థానిక రైతులు దొడ్డు రకం వరి నుంచి సన్న రకం వరికి మారి అధిక లాభాలు పొందుతున్నారు. మార్కెట్లో ఈ సన్న వరికి మంచి డిమాండ్ ఉండడంతో, హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఎన్ఎల్ఆర్, కెఎన్ఎం, ఆర్ఎన్ఆర్ వంటి సన్న రకాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు ప్రకృతి వైపరీత్యాలను...