తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి
ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ పోరాటం చేసిన విద్యార్థి నాయకులను కూడా గుర్తించాలని విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి, మంథని, మార్చి 16 (వార్త సంధ్య): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ పేర్కొన్నారు.సోమవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు...