ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు : శ్యాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి ఎన్నికల హామీమేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి కొత్తగూడెం శ్యాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్, ఏప్రిల్ 21 ( వార్త సంధ్య) : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ...