యువతలో క్రీడా నైపుణ్యాల పెంపుకు శిక్షణ శిబిరాలు అవసరం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
వనస్థలిపురంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం ఎల్బీనగర్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం చత్రపతి శివాజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు, యువతకు క్రీడలు మరియు ఫిట్‌నెస్ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇవి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లల్లో ప్రతిభ పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం...