Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 5:06 pm Posted by : VARTHA SANDHYA DESK

యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యసేవలు: యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 23 ( వార్త సంధ్య):
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో యూరాలజిస్ట్ వైద్యులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ మన జనాభాలో సరాసరి 5 శాతం మందికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే ఆపరేషన్ వరకు వెళ్లే అవసరం లేదని అన్నారు. యశోద ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన వైద్య పరికరాలు రోబోటిక్ ఎక్స్రేలు అందుబాటులో ఉన్నాయని, మిగతా దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని పేర్కొన్నారు. కిడ్నీ క్యాన్సర్ కు సంబంధించిన రోబోటిక్ వైద్య పరీక్షలు యశోద హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ యశోద సిబ్బంది పాల్గొన్నారు.