Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 9:19 pm Posted by : VARTHA SANDHYA DESK

2026 ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో శ్రీ రాగా స్కూల్ ప్రభంజనం

100% ఉత్తీర్ణతతో అద్భుత విజయగాథ

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : బుధవారం విడుదలైన 2026 ఎస్‌ఎస్‌సి పరీక్షా ఫలితాల్లో శ్రీ రాగా స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విశేష విజయాన్ని సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

పాఠశాల స్థాయిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల్లో బి. అఖిల్ 560 మార్కులు, రిషిత్ రాణా 532 మార్కులు, టీ. హేమంత్ నాయక్ 519 మార్కులు, డి. శ్రీ చైతన్య 505 మార్కులు, యెస్.కె. ఆజ్మిల్ 500 మార్కులు సాధించారు.మొత్తం 30 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించడం ద్వారా పాఠశాల 100 శాతం ఫలితాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎం. కవిత ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఫలితాలు శ్రీ రాగా స్కూల్‌లోని నాణ్యమైన విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల కృషిని ప్రతిబింబిస్తున్నాయని యాజమాన్యం పేర్కొంది. టాప్ స్కోర్లు సాధించి పాఠశాల కీర్తి పతాకాన్ని ఎగురవేసిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ విజయానికి తోడ్పడిన టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, అలాగే తమ పిల్లల విద్యాభివృద్ధికి నిరంతరం సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ఉత్తీర్ణులైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.