ఎఫ్-లైన్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి
కేటగిరీ-బి పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పని చేయాలని సూచన రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 11 (వార్త సంధ్య): జిల్లాలో ఎఫ్-లైన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (ఏడీ, ఎస్‌ఎల్‌ఆర్) ఆధ్వర్యంలో మండల సర్వేయర్లు, డీఐఓఎస్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా...