రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం ..
ఈనెల 26 నుంచి వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు “అపర భద్రాద్రి”గా ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రం భక్తులతో కళకళలాడనున్న అటవీ గుట్టపై ఆలయం అచ్చంపేట ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య):నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రాములోరి కల్యాణానికి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈనెల 26వ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పరిసరాలు వేడుక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని...