సమ్మెను జయప్రదం చెయ్యండి :ఎఐటియుసి

పీవీకే–5 గనిలో వాల్ పోస్టర్ విడుదల కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం వైఫల్యమని ఆరోపణ ఈ నెల 17 నుంచి 30 వరకు ఆందోళనలకు పిలుపు కొత్తగూడెం/సింగరేణి,(వార్త సంధ్య): సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ రోజు పీవీకే–5 గనిలో నిర్వహించిన కార్యక్రమంలో సమ్మెకు మద్దతుగా వాల్ పోస్టర్‌ను ఎఐటియుసి నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కొన్ని కార్మిక సమస్యలను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో...