సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్రిక్తం చేస్తాం: ఏఐటియుసి హెచ్చరిక
నల్ల బ్యాడ్జీలతో అన్ని విభాగాల్లో నిరసన సింగరేణి యాజమాన్యంపై ఆలస్యం ఆరోపణలు 30న భారీ ధర్నా, ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపు కొత్తగూడెం/సింగరేణి, మార్చి 17 (వార్త సంధ్య): సింగరేణి సంస్థలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని గుర్తింపు సంఘం ఏఐటియుసి తీవ్రంగా విమర్శించింది. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించింది.మంగళవారం ఉదయం కార్పొరేట్ ప్రాంతంలోని అన్ని విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం యాజమాన్యానికి మెమొరాండం సమర్పించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన...