శ్రీరామ్ ఫైనాన్స్ మోసాలపై చర్యలు తీసుకోండి

రూ.60 లక్షల లోన్ వ్యవహారంలో బాధితుడి ఆరోపణలు అధిక వడ్డీ, వేధింపులపై ఆవేదన వ్యక్తం సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ప్రకటన హైదరాబాద్ సిటీ ప్రతినిధి, మార్చి 17 (వార్త సంధ్య): శ్రీరామ్ ఫైనాన్స్‌లో జరుగుతున్న మోసాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భువనగిరిలోని శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా రూ.60 లక్షల లోన్ తీసుకున్నానని, అయితే తనకు రూ.57,47,666 చెక్కు రూపంలో ఇచ్చారని...