- సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విద్యార్థి నాయకుల సమావేశం
హైదరాబాద్ సిటీ, మార్చి 17 (వార్త సంధ్య): విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్‌లను కొత్త విధానంలో కాకుండా పాత విధానం ప్రకారమే అమలు చేయాలని ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత స్కాలర్షిప్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నింబోలి అడ్డ కాచిగూడ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌ను రీపేర్ చేసి తిరిగి ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి మరమ్మతులతోనే ఆ హాస్టల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు ఇతర కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులతో అందిస్తున్న స్కాలర్షిప్‌లను పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా రాష్ట్రంలోని కాలేజీ హాస్టళ్లలో కేటరింగ్ సిబ్బందిని తొలగించకుండా, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో రెగ్యులర్ చేయాలని సూచించారు. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసి, బోధన కోసం ఫ్యాకల్టీ నియమించాలని కోరారు.కాచిగూడ గర్ల్స్ హాస్టల్, బోలక్పూర్ ప్రాంతాల్లో శిధిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాలను పునర్నిర్మించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పలు విద్యార్థి నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.