సమాచార హక్కు చట్టంతో అవినీతి నిర్మూలన సాధ్యం: డా. చంటి ముదిరాజ్
ఆర్టీఐ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపుకు పిలుపు హైదరాబాద్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను వినియోగించి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని ఎదుర్కోవచ్చని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పౌరులకు సమాచారం పొందే హక్కును వినియోగించడంలో సహాయపడటమే సాధన కమిటీ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో...