ఆర్టీఐ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపుకు పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (వార్త సంధ్య):సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను వినియోగించి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని ఎదుర్కోవచ్చని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పౌరులకు సమాచారం పొందే హక్కును వినియోగించడంలో సహాయపడటమే సాధన కమిటీ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, పారదర్శకత కోసం ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి జాతీయ సహాయ కార్యదర్శి మార్క నవీన్ కుమార్, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మార్క నవీన్ కుమార్‌ను జాతీయ సహాయ కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీ సతీష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శివ కుమార్, అరవింద్ స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు భోగం విష్ణు, రంగారెడ్డి జిల్లా కన్వీనర్, ఉపాధ్యక్షుడు దీపక్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.