RTE చట్టం నీరుగార్చుతున్న ప్రైవేట్ స్కూళ్లు – 25% సీట్లు కాగితాలకే పరిమితం
పేదలకు నాణ్యమైన విద్య లక్ష్యం దెబ్బతింటోంది అడ్మిషన్లలో పారదర్శకత లేకపోవడం పై విమర్శలు “సీట్లు లేవు” అంటూ తల్లిదండ్రుల తిరస్కరణ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు హైదరాబాద్, మే 7: పేద మరియు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టం (RTE) ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ అన్-ఎయిడెడ్ స్కూల్‌లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు...