పీఎం మోదీ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, జూన్ 11 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సమర్పించారు. తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే...