మహనీయులను స్మరించుకోవడం సమాజానికి అవసరం: బక్కి వెంకటయ్య

మహనీయుల ఉత్సవ సభ కరపత్రం విడుదల కార్యక్రమంలో బక్కి వెంకటయ్య దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 26(వార్త సంధ్య ) ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించనున్న మహనీయుల ఉత్సవ సభకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం భూంపల్లి, అక్బర్‌పేట మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవానికి నాంది...