Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 4:19 pm Posted by : kasaramkrushna@gmail.com

మహనీయులను స్మరించుకోవడం సమాజానికి అవసరం: బక్కి వెంకటయ్య

మహనీయుల ఉత్సవ సభ కరపత్రం విడుదల కార్యక్రమంలో బక్కి వెంకటయ్య

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 26(వార్త సంధ్య )

ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించనున్న మహనీయుల ఉత్సవ సభకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం భూంపల్లి, అక్బర్‌పేట మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా పేదలు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వానికి పునాది వేశారని పేర్కొన్నారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ దేశంలో తొలి దళిత ఉప ప్రధానిగా ప్రజాసేవలో నిలిచారని గుర్తుచేశారు.

సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలన్న మహనీయుల ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చీకోడ్ గ్రామంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, దుబ్బాక మాజీ కౌన్సిలర్ అస యాదగిరి, మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, న్యాయవాది బండ నరసింహులు, బండమీద మల్లన్న, ప్రముఖ కవి-గాయకుడు చీకోడు నర్సింలు, ఇనుప సురేష్, జిల్లా కన్జూమర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంబాల రవి, దళిత రత్న బిట్ల యాదగిరి, టెలికం బోర్డు సభ్యులు వనం కనకయ్య, దుబ్బాక పరుశరాములు, కమ్మరి శ్రీనివాస్,ఇనుప సురేష్,ఇనుప శ్రీకాంత్, రమేష్, వనం రాజయ్య, బండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.