రంగారెడ్డి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు

281 మంది లైసెన్స్ సర్వేయర్లతో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమీక్ష సమావేశం రీసర్వే, భూభారతి, భూసేకరణ పనుల నిర్వహణపై కీలక సూచనలు రంగారెడ్డి జిల్లా బ్యూరో , జూన్ 12 (వార్త సంధ్య) : రంగారెడ్డి జిల్లాలో ఎంపికైన 281 మంది లైసెన్స్ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, జిల్లా సర్వే అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సర్వేయర్ల విధులు, పారితోషికం, ప్రభుత్వ పనుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు....