రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్‌గా డా. కే. రామారావు ఏకగ్రీవం

మే 5 నిరాహార దీక్షకు సన్నాహక సమావేశం రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) మే 5న కలెక్టరేట్ కొంగరకలాన్‌లో నిర్వహించనున్న ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి సన్నాహక సమావేశం నాంపల్లి టీజీవో భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మే 5న జరగబోయే నిరాహార దీక్ష కార్యక్రమానికి నాయకత్వ బాధ్యతలను టీజీఓ రంగారెడ్డి జిల్లా...