ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక కార్యాచరణ సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారానికి చర్యలు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గురువారం...