ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం
పెట్రోల్ పోసుకుని దహనం ప్రయత్నం – గాంధీ ఆసుపత్రికి తరలింపు ఉస్మానియా యూనివర్సిటీ , వార్త సంధ్య:ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కలకలం రేగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన వినీష్, ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో మైనింగ్ చదువుతున్న విద్యార్థి, ఈరోజు ఉదయం విశ్వవిద్యాలయం ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.విశ్వవిద్యాలయంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని తనను తాను దహనం చేసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఘటనను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, విద్యార్థిని అదుపులోకి తీసుకుని అత్యవసరంగా గాంధీ...