Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:55 pm Posted by : VARTHA SANDHYA DESK

రూపాయికి కంటి పరీక్షలు… ఒక్క రూపాయికి సేవలు

  • వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథం
  • నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ హబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 26 (వార్త సంధ్య): కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ హబ్‌ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి చూపు బాగుంటేనే మనం ప్రపంచాన్ని సరిగా చూడగలుగుతామని, ఏదైనా సాధించగలమని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన కంటి సేవలు అందించడం చాలా అవసరమని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆప్టికల్ హబ్‌లో కస్టమర్లకు ఒక్క రూపాయికే సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సేవా భావంతో పనిచేస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని యాజమాన్యానికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఉమా శ్రీనివాస్, వైస్ చైర్మన్ గోదావరి తదితరులు పాల్గొన్నారు. ఆప్టికల్ హబ్ నిర్వాహకులు బుస్స శ్రీనివాస్, రోహిత్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.