భాషిత జూనియర్ కళాశాల అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ
డీఐఈఓపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనుమతి లేని కళాశాలలను సీజ్ చేయాలని హెచ్చరిక హైదరాబాద్/మేడ్చల్-మల్కాజిగిరి, జూన్ 15 (వార్త సంధ్య): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఖుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లోని భాషిత జూనియర్ కళాశాలలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ...