ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, మంచినీటి పంపిణీ

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 27(వార్త సంధ్య ): దుబ్బాక మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) పనుల్లో నిమగ్నమైన కూలీలకు 1వ వార్డు మెంబర్ షరీఫ్, 3వ వార్డు మెంబర్ కంకణాల రాజు ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ మరియు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు.గ్రామంలో రైతులకు సాగు పనుల కోసం వెళ్లే మార్గాలను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద గ్రావెల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని, వారి...