Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 4:35 pm Posted by : VARTHA SANDHYA DESK

నీర కేఫ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

  • రెండేళ్లపాటు నిర్వహణకు అవకాశం
  • గీత కార్మిక సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
  • ఈ నెల 18 వరకు బిడ్ దాఖలు, 28న ఓపెనింగ్

రంగారెడ్డి జిల్లా బ్యూరో, మార్చి 17 (వార్త సంధ్య): హైదరాబాద్‌లో గల నీర కేఫ్‌ను రెండేళ్లపాటు నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం ఉప సంచాలకులు బి. కేశురాం తెలిపారు.ఈ సందర్భంగా టెండర్‌కు సంబంధించిన విధి విధానాలను ఆయన వివరించారు. గీత కార్మిక సంఘాల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టెండర్ దాఖలు కోసం రూ.1000 డిమాండ్ డ్రాఫ్ట్‌ను “టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ (నీర కేఫ్)” పేరిట సమర్పించాలని సూచించారు.అలాగే ఎక్సైజ్ శాఖ సర్టిఫికేట్, లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఈఎండి రూపంలో రూ.2 లక్షలు, సొసైటీ తీర్మాన పత్రం వంటి అవసరమైన పత్రాలను జతచేయాలని తెలిపారు.ఆసక్తి గల వారు టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. బిడ్ దాఖలు చివరి తేదీ ఈ నెల 18 కాగా, టెండర్లను ఈ నెల 28న ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు.మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tgtcfc.com లేదా సమీప ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.